అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు- జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు



అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.


శుక్రవారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో 

ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి  తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే లతో కలిసి పోలీసు, రెవెన్యూ, టీజిఎండీసీ, గృహ నిర్మాణ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. కొందరు అక్రమార్కులు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తప్పుడు పత్రాల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేపట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్కడక్కడ పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని  అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ కట్టడాలకు ఇసుక ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని 

ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇసుక రవాణా కు టీ.ఎస్.ఎం.ఐ.డి.సి ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు.

ఇసుకతో పాటు మట్టికి  కూడా అనుమతులు ఇవ్వాలని 

నియోజకవర్గంలో పరిశ్రమల నిర్మాణానికి సైతం ఇసుక ఉచితంగా అందించాలని తెలిపారు.

పంచాయతీ సెక్రటరీలు, ఇందిరమ్మ ఇళ్లుకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. శాయంపేట మండలం నుండి స్థానిక పంచాయతీ కార్యదర్శి నుండి అనుమతితో ఉచితంగా పొందాలన్నారు. రాజకీయ పలుకుబడులు, ఒత్తిడులు ఎన్ని ఉన్న ఖచ్చితంగా అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తహసీల్దార్లు అక్రమ ఇసుక దంపులను సీజ్ చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి వేలం వేయాలని అన్నారు.

వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడం జరిగిందని

ప్రభుత్వం కేటాయించిన  ధర ప్రకారం మాత్రమే అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రత్యేకంగా పంచాయతీ సెక్రటరీలకు రశీదు పుస్తకాలు ఈ నెల 25 వ తేదీ వరకు పంపిణీ చేయాలని మండలాలలో పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాలని తెలిపారు. గ్రామ స్థాయిలో టామ్ టామ్ వేయించాలని సూచించారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ఇసుక రవాణా 24 తేదీ నుండి ఇసుక రవాణా కు కూపన్లు అందిస్తామన్నారు. అక్రమ ఇసుక రవాణాను, ఇసుక డంపులపై కచ్చితంగా కేసుకు నమోదు చేయాలని అన్నారు.

పంచాయతీ సెక్రెటరీలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎంపిడిఓలకు బాధ్యత అప్పగిస్తామని తెలిపారు.

ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటలకు వరకు ఉచిత రవాణా కు అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రెవిన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, రవాణా శాఖల అధికారులతో టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేపడితే కట్టిన చర్యలు తీసుకుంటామని అవగాహనకు దండోరా వేయాలని అన్నారు.

ఇసుక డంపులను  జిల్లా కలెక్టర్ సమక్షంలో వేలం జరగాలని సూచించారు.


యూరియా అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మైనింగ్ ఎడి జయరాజ్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు