KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాలు



*KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బతుకమ్మ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

*విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య*


కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహ పరిచారు.






ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. పువ్వులను పూజించే తెలంగాణ ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ అని అన్నారు. ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉందన్నారు.  రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మల ధైర్యసాహసాలు ఓరుగల్లు ప్రతీకలుగా నిలిచాయని గుర్తుచేశారు. విద్యార్థినులు అనుకున్నది సాధించాలంటే క్రమశిక్షణ, కష్టపడి చదవడం అవసరమని ఎంపీ ప్రోత్సహించారు. సోషల్ మీడియా వినియోగం, ఏఐ  టెక్నాలజీల పట్ల బాలికలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు