తల్లాడ తహసీల్దారు కార్యాలయంలో లంచం కేసులో –తహసీల్దార్, ఆర్ఐ, డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖమ్మం జిల్లా తల్లాడ మండల తహసీల్దారు కార్యాలయంలో లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు గురువారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల వలలో చిక్కుకున్నారు.ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి, సంబంధిత పనిని పూర్తి చేస్తామంటూ రూ.10 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు పట్టుకున్నారు.
ఈ కేసులో తహసీల్దారు వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ అరెస్టైనట్లు అనిశా అధికారులు వెల్లడించారు.
అవినీతి నిరోధక శాఖ – ప్రభుత్వ సేవకులు లంచం అడిగితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది. అదనంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చని తెలిపింది.
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగానే ఉంచబడతాయని స్పష్టం చేసింది.

0 కామెంట్‌లు