మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయండి

 



వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, పులి సత్యనారాయణ


     అవనిలో సగమైన మహిళలు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్న న్యాయ వ్యవస్థలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అట్టి సమస్యలపై ఈ నెల 28న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగు మహిళా న్యాయవాదుల తెలంగాణ రాష్ట్ర సదస్సుకు మహిళా న్యాయవాదులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్, పులి సత్యనారాయణ లు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులతో కలసి శుక్రవారం సదస్సు గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు న్యాయ వ్యవస్థలో రాణిస్తునపటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని, ఐక్యతతో ఆ వివక్షను ఎదుర్కొని సమాన అవకాశాలను పొందాలని అన్నారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ మహిళా న్యాయవాదుల సదస్సుకు ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, విశిష్ట అతిథులుగా జస్టిస్ తిరుమలదేవి ఈడ, ప్రత్యేక ఆహ్వానితులుగా  ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత చౌదంటే హాజరవుతారని, భారతీయ న్యాయ వ్యవస్థ దాని పితృస్వామ్య స్వభావం మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు వారి వృత్తిపరమైన అభివృద్ధి పరిష్కారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు అనే అంశంపై హై కోర్టు రిటైర్డ్ జడ్జి జి రాధారాణి సందేశం ఇస్తారని తెలిపారు. న్యాయ రక్షకులను రక్షించండి, మహిళా న్యాయవాదులపై ప్రత్యేక దృష్టి సారించి న్యాయవాదుల రక్షణ చట్టం యొక్క రాజ్యాంగ అవసరం అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాది ఆర్ గంగాభవాని, ఉన్నత న్యాయస్థానాలలో మహిళా న్యాయమూర్తులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు పదవీకాల స్థానాలతో సహా జనాభా దామాషా రిజర్వేషన్లను అమలు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, బార్ కౌన్సిల్‌లు బార్ అసోసియేషన్ల ఎన్నికలలో మహిళా వాటాలో బహుజన కోటా   తగిన ప్రాతినిధ్యం అనే అంశంపై ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ రిటైర్డ్ అధికారి పి సత్యనారాయణ మూర్తి సందేశం ఇస్తారని తెలిపారు. 

   ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిల్ల రాజేంద్రప్రసాద్, వరంగల్ జిల్లా కన్వీనర్ విలాసాగరం సురేందర్ గౌడ్, హనుమకొండ బార్ కన్వీనర్ పూసపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు చింత సాంబశివరావు, సి మల్లేష్, సుందర్ రామ్, రమాదేవి, ఉమా గౌడ్, శ్రీలత, అన్నపూర్ణ, అనిత, రాధిక, సుప్రజ, సుల్తానా, పద్మ యాదవ్, సంధ్య, జయశ్రీ, రజిత, బిందు ప్రియ, మౌనిక, జలజ, జి ఆర్ శ్రీనివాస్, దండు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు