కాంగ్రెస్ పార్టీ లో చేరిన యువకులు

 


వరంగల్, ఫిబ్రవరి 25:

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 100 మంది యువకులు కాంగ్రెస్కాం పార్టీ లో చేరారు. 

బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో చేరిన యువకులకు  పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకుడు పల్లె రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో యువతే రాజకీయాల్లో కీలక భూమిక పోషించనుందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. రాజేందర్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.



వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల యువత భారీగా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. దీపక్, అజయ్ తదితరులతో కలిసి మొత్తం 100 మంది యువకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు