జాతీయ వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని, హైకోర్టు న్యాయమూర్తి-అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకోర్టు లోని 10 కోర్టుల భవనం లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ- వరంగల్ చైర్మన్స్ వి.బి.నిర్మలా గీతాంబ, పట్టాభి రామారావు, కార్యదర్శులు యం.సాయి కుమార్, క్షమా దేశ్ పాండే, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, ఉమ్మడి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఇతర న్యాయవాదులు, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు కృషి చేయాలన్నారు. న్యాయమూర్తులు పాత సివిల్ కేసులపై దృష్టి సారించి, మధ్యవర్తిత్వం నిర్వహించి, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బిల్డింగ్ ముందు *మధ్యవర్తిత్వం ద్వారా జరిగే లాభాలు* బ్యానర్ ను ఆవిష్కరించడం జరిగింది.
జాతీయ లోక్ అదాలత్ లో వివిధ కేసులను పరిష్కరించుటకు జిల్లా వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో-08 , నర్సంపేట-02 బెంచీలను ఏర్పాటు జరిగింది.
జాతీయ లోక్ అదాలత్ లో 5912 కేసులు పరిష్కారం
వరంగల్ జిల్లా వ్యాప్తంగా-10 బెంచీలను ఏర్పాటు చేసి, మొత్తం-5938 పెండింగ్ కేసులను ఇందులో సివిల్ కేసులు-26, యమ్.వి.ఓ.పి. కేసులు- 24, (రూ.2,15,44,176 /-), క్రిమినల్ కేసులు- 5912, మరియు బ్యాంక్ పి.ఎల్.సి. కేసులు- 76,720 (రూ.2,28,82,709/- ) పరిష్కరించడం జరిగింది.
ఈ జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా వినూత్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్ కుమార్ సుమారు 300 పులిహోర ప్యాకెట్లు కక్షిదారులకు అందజేయడం జరిగింది, లయన్స్ క్లబ్ నుండి జయశ్రీ, రమాదేవి పాల్గొన్నారు.
ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయసేవాధికార సంస్థ ద్వారా వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఇరువురు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0 కామెంట్‌లు