*వరంగల్ తూర్పు నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయం: రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయశాఖ శాఖామంత్రి కొండ సురేఖ*
*తూర్పు నియోజకవర్గం లో రూ.3 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి*
వరంగల్: 13 సెప్టెంబర్ 20 25:వరంగల్ తూర్పు నియోజకవర్గం సమగ్ర అభివృద్దే ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయశాఖ శాఖామంత్రి శ్రీమతి కొండ సురేఖ అన్నారు.
శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్లలో రూ.3 కోట్ల తో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ముందుగా వరంగల్ తూర్పులోని జిడబ్ల్యూఎంసీ పరిధిలోని 21వ డివిజన్ ఎల్ బి నగర్ లో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్డు, డ్రైన్స్ పనులకు,
కాశిబుగ్గ లో రూ.150 లక్షలతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి, రూ 50 లక్షలతో నిర్మించే సిసి రోడ్ పనులకు, 26వ డివిజన్ గిర్మాజీపేట లో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించే సిసి రోడ్లు, డ్రైన్స్ పనులకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం, కార్పొరేటర్లు మహ్మద్ ఫుర్ఖాన్, ఓని స్వర్ణలత భాస్కర్, బాల్నే సురేష్, డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ , బల్దియా ఈఈ సంతోష్ బాబు, సంబంధిత శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు