అక్రమాస్తుల కేసులో TGS PDCL ఏడిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు



హైదరాబాద్‌ ఇబ్రహీంబాగ్‌లో విధులు నిర్వహిస్తున్న టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సహాయక డివిజనల్ ఇంజనీరు (ఆపరేషన్స్) ఇరుగు అంబేద్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు.అనంతరం అరెస్ట్ చేసి రిమాండు తరలించారు.

మంగళవారం అంబేద్కర్‌ ఇంకా అతని బంధువుల ఇళ్లలో కలిపి 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గల ఒక గృహం, ఒక భవనం (G+5), రెండు ఓపెన్‌ ప్లాట్లు, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల భూమిలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమ (ఆంథర్ కెమికల్స్), బంగారు ఆభరణాలు, రెండు నాలుగు చక్రాల వాహనాలు మరియు రూ.2.18 కోట్ల నగదు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.

అనిశా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 కు కాల్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా వాట్సాప్‌ 9440446106, ఫేస్‌బుక్‌ (Telangana ACB), ఎక్స్‌ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్‌ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు.

ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు హామీ ఇచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు