ఐ డి ఓ సి నిర్మాణ పనులల్లో వేగం పెంచాలి



జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్.

***

ఐడిఓసి నిర్మాణ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను 

ఆదేశించారు. 

బుదవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రక్కన నూతనంగా నిర్మిస్తున్న  సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌)  నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కలెక్టరేట్ భవనం ను కలియ తిరుగుతూ స్టేట్ బోర్డు ఛాంబర్, కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాలు, ఇతర శాఖల అధికారులకు కేటాయించే 

గదులను పరిశీలించారు. ఈ ఈ ఆర్ అండ్ బి కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత లోపించకుండా గ్రానైట్, ఎలక్ట్రిషన్,  ప్లంబింగ్ మ్యాన్ పవర్ ను పెంచి త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు. ఎంట్రన్స్ వద్ద రెడ్ సెల్ తో రోలింగ్ చేయించి  సుందరీకరణ పనులు చేయాలని చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఈ ఈ ఆర్ అండ్ బి శ్యామ్ సింగ్ సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులు,  తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు