ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్లు & స్టాంపుల శాఖ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు దొరికాడు.
ఒక ఫిర్యాదుదారుడు తన భార్య పేరుమీద ఉన్న గృహాన్ని బహుమతి డీడ్ క్రింద తన పేరుకు నమోదు చేసుకోవడానికి అధికార సహాయం కావాలని రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో ఆయన నుంచి రూ.5,000 లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడ్డాదు.
ప్రస్తుతం నిందితుడిపై అనిశా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ సేవకుడు ఎవరు లంచం అడిగినా లేదా అవినీతికి పాల్పడ్డా వెంటనే సమాచారం అందించాల్సిందిగా ఎసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసార.
అవినీతి నిరోధక శాఖ (ACB)ను టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా సంప్రదించవచ్చు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకునే వీలుందని అధికారులు తెలిపారు.
ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని అనిశా స్పష్టం చేసింది.
0 కామెంట్‌లు