పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
రాష్ట్ర అధ్యక్షుడిగా పి. మహేష్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు
విద్యారంగ సమస్యలపై విప్లవాత్మక ఉద్యమం నిర్మిస్తాం: నూతన నేతల ప్రకటన
వరంగల్,జనవరి 7, 2026
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU (పీడీఎస్‌యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ మహాసభల సందర్భంగా సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి. శ్రీకాంత్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించగా, మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా పి. మహేష్‌ను, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజును ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ వివరాలు:
ఉపాధ్యక్షులు:
బోనగిరి మధు (మహబూబాబాద్), జన్నారాపు రాజేశ్వర్ (నిజామాబాద్), డి. శ్రీకాంత్ (మంచిర్యాల), సందీప్ (సంగారెడ్డి), కే. శ్రీనివాస్ (హైదరాబాద్), కే. రానా ప్రతాప్ (కరీంనగర్)
సహాయ కార్యదర్శులు:
ఆర్. గౌతమ్ కుమార్ (నిజామాబాద్), జి. మస్తాన్ (ఖమ్మం), జగజంపుల తిరుపతి (ఆసిఫాబాద్), మంద నవీన్ (హైదరాబాద్), దీపాలక్ష్మి (ఆదిలాబాద్), గుర్రం అజయ్ (వరంగల్)
కోశాధికారి:
డి. ప్రణయ్ కుమార్ (భద్రాద్రి కొత్తగూడెం)
కార్యవర్గ సభ్యులు (17 మంది):
తీగల శ్యామ్, గడ్డం గౌతం, కే. ఝాన్సీ (హైదరాబాద్), పుల్లూరి సింహాద్రి (సూర్యాపేట), ప్రిన్స్ (నిజామాబాద్), కార్తీక్ (కామారెడ్డి), మర్రి మహేష్ (వరంగల్), మునగాల మహేష్ (మహబూబాబాద్), పోలే పవన్ (నల్గొండ), రాచకొండ ఉదయ్ (యాదాద్రి భువనగిరి), రెడ్డి చరణ్ (మంచిర్యాల), వెంకటేష్ (నిర్మల్), గణేష్ (ఆదిలాబాద్), శ్రీకాంత్ (సంగారెడ్డి), శ్రీనివాస్ (వికారాబాద్), వెంకటేష్ (వనపర్తి).
మొత్తం 31 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
విద్యారంగ సమస్యలపై కీలక తీర్మానాలు
ఈ మహాసభలో విద్యారంగ సమస్యలపై పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
ప్రధాన తీర్మానాలు ఇవి:
నూతన జాతీయ విద్యా విధానం – 2020ను రద్దు చేయాలి.
వికసిత భారత్ శిక్ష అధిష్టాన యాక్ట్‌ను రద్దు చేయాలి.
డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి.
పెండింగ్ ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలి.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.
ప్రైవేట్, విదేశీ విశ్వవిద్యాలయాలను రద్దు చేయాలి.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను అరికట్టాలి.
బలమైన విద్యార్థి ఉద్యమం నిర్మిస్తాం: నూతన నేతలు
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని, నూతన జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.
విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రానా ప్రతాప్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద నవీన్, రాష్ట్ర నాయకులు పుల్లూరి సింహాద్రి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, కార్యదర్శి మర్రి మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు