ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ ఎను
మాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని జిల్లా వేర్ హౌజ్ గోదాములలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల ( ఈవీఎంల)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు లోని జిల్లాకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చిన
ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వుల ననుసరించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికలలో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాం ను కూడా పరిశీలించి, జిల్లా వేర్ హౌజ్ కు తరలించారు.
ఈ తనిఖీలో ఆర్డీఓ లు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బి ఎస్ పి నుండి అనిల్, టిడిపి నుండి శ్యామ్, ఏ ఐ ఎం ఐ ఎం నుండి ఫైజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు