త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క.
***
బుదవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణం లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు.
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రి అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, ఆర్డీఓ వెంకటేష్,
అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు