మారు మూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-మంత్రి శ్రీధర్ బాబు

 



గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. 


శుక్రవారం మహా ముత్తారం మండలం బోర్లగూడెంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ, 12 లక్షలతో నిర్మించనున్న అంగన్ వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారు మూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.  గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, అంగన్ వాడి కేంద్రాలు, పంచాయతీ భవనాలు వంటి ప్రజా సదుపాయాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.  గ్రామంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా మురుగు కాల్వలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పుకు కృషి  చేస్తున్నామని ఆ క్రమంలోనే రేషన్ కార్డులు, పేదలకు,  సన్న బియ్యం,  200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్తు, 500లకే సబ్సిడీపై సిలెండర్లు, మహిళలకు  ఉచిత బస్సు రవాణా  సౌకర్యం కల్పించామని తెలిపారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర సభ్యులు రమేష్, 

 జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజా బాపు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,  కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిర్మల సమ్మయ్య, 

పి ఆర్ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు