రైతులకు జాప్యం లేకుండా ఎరువులు పంపిణి చేయాలి- జనగామ జిల్లా కలెక్టర్



పాలకుర్తి మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన


పాలకుర్తి: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం పాలకుర్తి మండలంలో పలు గ్రామాలలో  పర్యటించారు.

ముందుగా శ్రీ సోమేశ్వర ఆలయానికి సమీపంలోని **స్మృతి వనాన్ని** పరిశీలించిన ఆయన, భక్తులు ఆహ్లాదకరంగా గడపడానికి అవసరమైన వసతులు వెంటనే కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్, సీసీ కెమెరాలు, పిల్లల ఆట వస్తువులు, వనితా టీ స్టాల్, వాచ్‌మన్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.


తరువాత మండల సమాఖ్య సమావేశాల కోసం కేటాయించిన ఫంక్షన్ హాల్ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్, ప్రజలు ఇబ్బంది లేకుండా వసతులు పొందేలా చూడాలని ఆదేశించారు.


అనంతరం మండలంలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రైతులకు యూరియా పంపిణీ సజావుగా జరుగుతోందో లేదో పరిశీలించారు. స్టాక్ రిజిస్ట్రర్లు, గోదాముల నిల్వలను చెక్ చేసిన ఆయన, యూరియా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను ఎక్కువసేపు వేచి ఉండనీయకుండా అమ్మకాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు