తెలంగాణలో త్వరలో హెలీ టూరిజం

 



హైదరాబాద్‌–సోమశిల–శ్రీశైలం మార్గంలో హెలీ టూరిజం ప్రారంభానికి పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. ఈజ్ మై ట్రిప్ సహకారంతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గగనతల విహారంతో పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించడమే లక్ష్యమని చెప్పారు.


అదే సమయంలో రూ.68.10 కోట్ల వ్యయంతో సోమశిల–నల్లమల–అమరగిరి ప్రాంతాల్లో వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ (రూ.45.84 కోట్లు), సోమశిల విఐపీ ఘాట్–బోటింగ్ పాయింట్ (రూ.1.60 కోట్లు) అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.


మంత్రి జూపల్లి మాట్లాడుతూ… “పర్యాటక రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నల్లమల సర్క్యూట్ అభివృద్ధితో ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా మారనుంది. కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ఆదాయాన్ని, ఉపాధిని పెంచుతాయి” అని తెలిపారు.


అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ – రూ.45.84 కోట్లు


సోమశిల విఐపీ ఘాట్, బోటింగ్ పాయింట్ – రూ.1.60 కోట్లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు