ఎసిబి వలలో డోర్నకల్ సిఐ భూక్యా రాజేష్, అతని గన్ మెన్

 




మహ బూబాబాద్ జిల్లా డోర్నకల్  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూక్యా రాజేష్, అతని గన్ మెన్,  ధారావత్ రవి ఈ ఇద్దరిని  తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటుండగా  పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుని వాహనాన్ని డోర్నకల్ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసులో జప్తు చేశారు.  వాహనం విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ఈ  కేసులో సహాయం చేసేందుకు  ఇన్స్పెక్టర్ రాజేష్ రూ.50,000 లంచం డిమాండ్ చేసాడు. మొదటి  విడతలో భాగంగా  రూ.30,000 తీసుకుంటూ అధికారులు పట్టుకున్నారు.,

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ **1064** కి కాల్ చేయాలని, అదనంగా **వాట్సాప్ (9440446106)**, **ఫేస్‌బుక్ (Telangana ACB)**, **ఎక్స్ (@TelanganaACB)**, లేదా **[https://acb.telangana.gov.in](https://acb.telangana.gov.in)** వెబ్‌సైట్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని పేర్కొంది. ఫిర్యాదు దారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎసిబి అధికారులు  తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు