ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్.
గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్.
గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించిన శంతను నారాయణ్.
తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడిన సిఎం
ఎకానమీపై AI రెవల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో AI ని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్ తో చర్చించిన సీఎం.
తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని కోరిన సీఎం.

0 కామెంట్‌లు