బంజారాల సంక్షేమం పై ప్రభుత్వo ప్రత్యేక దృష్టి -మంత్రి సీతక్క



అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలి.

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంను  అనుసరించాలి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, 

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.


****

రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 


బుదవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ గుడి హరిత హోటల్ పక్కన తెలంగాణ ప్రభుత్వం సద్గురుసంత్ 

శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా  నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి  రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ బిక్షపతి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, బంజారా కులస్తులు భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు. రానున్న రోజులలో ప్రభుత్వం వారి సంక్షేమం కోసం వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. సమావేశానికి ముందు సీతక్క బంజారా భాషలో మాట్లాడి అబ్బురపరిచారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదువు వలననే ఏ జాతి అయినా బాగుపడుతుందని, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలని, అభివృద్ధి చెందిన వారు మిగతా వారి ఉన్నతికి పాటుపడాలని, మనం ఏం చేయాలన్న వారి  స్ఫూర్తి తీసుకొవాలన్నారు. జిల్లాలో గిరిజన అధికారులు సామాజిక అభివృద్ధి అంశాలలో చొరవ తీసుకోవాలని, సంత్ సేవాలాల్ చూపిన ఆశయాలను అందరి సహకారంతో సాధించాలని, గిరిజన జాతి అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. 


ముందుగా ములుగు బంజారాల కుల పెద్ద పోరిక గోవింద్ నాయక్  మాట్లాడుతూ బంజారాలకు మద్దిమడుగు లో 20 ఎకరాల స్థలంలో గుడి నిర్మాణం కోసం కేటాయించినందుకు,  ములుగు జిల్లా గట్టమ్మ వద్ద సుమారు 20 గుంటల స్థలం,  ఆలయ నిర్మాణం కోసం పూర్తి సహకారాలు అందిస్తానని తెలిపినందుకు ములుగు జిల్లా బంజరాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు పోరిక గోవింద్ నాయక్, పూజారులు రమేష్ గిరి మహారాజ్, కిషన్ మహారాజ్, ఐటిడిఏ అధికారి జనార్ధన్, రాహుల్, బంజారా కులస్తులు, ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు