BIG TV ఛైర్మెన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఆయన సోదరుడు విజయ్ కాంత్ రెడ్డి లను పరామార్శించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, మాజీ ఉప ముఖ్య మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి...
మాజీ TPCC రాష్ట్ర కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ కాంత్ రెడ్డి లను మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు.
వారి తండ్రి వెన్నం రాఘవేంద్ర రెడ్డి ఇటీవల మరణించగా మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని వారి స్వగ్రామం అయిన రెడ్యాల గ్రామానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వెన్నం రాఘవేంద్ర రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు