వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయుంచారు.
ఈ సందర్బంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని.రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ఏ. ఆర్ అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు,బాల స్వామి సురేష్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, జాన్ నర్సింహులు, డేవిడ్ రాజు, నాగయ్య,గిరికుమార్, సురేంద్ర,ఏ. ఓ సంపత్ కుమార్ తో పాటు ఆర్.ఐలు, ఇన్స్ స్పెక్టర్లలు, ఇతర పోలీస్, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.


0 కామెంట్‌లు