📰 నీటి శుద్ధి ప్లాంటు... ఉచిత వైద్య శిభిరం.. కుట్టు మెషిన్లు.. ఇందిరమ్మ చీరల పంపిణి.
ములుగు:నవంబర్ 24,2025:
ములుగు మండలం లోని మంత్రి సీతక్క స్వగ్రామం అయిన జగ్గన్నపేట గ్రామంలో సోమవారం పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు.
మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ఆర్ నిధుల సహాయంతో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ధి కేంద్రం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే కోటక్ మహేంద్ర బ్యాంక్ సహకారంతో 175 మందికి ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రాలు అందజేయడంతో పాటు, లబ్ధిదారులకు ఉచిత కుట్టుమిషనులను పంపిణీ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కురేందుల శంకర్‌తో పాటు మరో 8 మందికి పాడి గేదెలను ₹1,40,000 సబ్సిడీతో మంజూరు చేశారు. అదనంగా, ఇందిరమ్మ చీరలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఏపీఎం శ్రీనివాస్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కోటక్ మహేంద్ర ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు