జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 18 వరకు అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో "మినీ సరస్ ఫెయిర్ -2025" నిర్వహిస్తున్నారు.
గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తూ విక్రయించనున్నారు.
ఈ ఫెయిర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలు ప్రదర్శించిన పలు హస్త కళా వస్తువులను, చేనేత వస్త్రాలను పరిశీలించారు.
కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీధర్, మెప్మా పీడీ స్వరూప రాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు