హోంగార్డుకి ఆర్థిక సహాయం అందించిన సహోద్యోగులు
హన్మకొండ ట్రాఫిక్ విభాగంలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ భార్య చనిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా సహోద్యోగులు ఆర్థిక సహాయం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు.
శ్రీనివాస్ సతీమణి ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పటల్ లో చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితం మరణించారు. వైద్య ఖర్చులు అధికమవడంతో హోంగార్డ్ శ్రీనివాస్ పై ఆర్థిక భారం పడింది. దాంతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు తమ వంతు సహకారం అందించేందుకు నిర్ణయించారు.
ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సీత రెడ్డి ప్రతిపాదన మేరకు ట్రాఫిక్ సిబ్బంది తమ వంతు సహకారంగా జమచేసిన 72వేల రూపాయలకు ఫిక్స్ డిపాజిట్ పత్రాలను ట్రాఫిక్ ఏసీపీ సత్య నారాయణ చేతుల మీదుగా శ్రీనివాస్ పిల్లలకు అందజేశారు. ఈ సందర్బంగా నిరుపేద హోమ్ గార్డ్ కుటుంబానికి ఆర్ధిక సాయం అదించిన ట్రాఫిక్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో హన్మకొండ ఇన్స్ స్పెక్టర్ సీతారెడ్డి,ఎస్. ఐలు కొమురెల్లి, ఫసిద్దీన్, విజయ్ కుమార్ తో ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

0 కామెంట్‌లు