*_రామోజీ పోరాటం.._*
*_తరువాయి పేజీలో!_*
✍️✍️✍️✍️✍️✍️✍️
మరణమే ఉండని
యోధుడు..
మరో మజిలీకి బయలెల్లాడు..
అక్షరాల పల్లకిపై..!
విశ్రాంతి ఎరుగక
పడిన కష్టం..
కాష్టంలోనైనా
విశ్రమిస్తుందా..
పార్థివదేహమైనా కూడా
పార్థాయ ప్రతిభోధితాం
అంటూ కర్తవ్యాన్ని
బోధించదా..!
దుర్మార్గంపై అలుపెరుగని
పోరాటం చేసిన ధీశాలి..
అక్షరాల విలువ తెలిసి
వాటిని లక్షలుగా
మార్చుకున్నా
భద్రంగా దాచుకోక
ఎన్నో రంగాల్లో
వినియోగించిన మదుపరి..
ఎక్కడ..ఎప్పుడు..
ఏం చెయ్యాలో
గుర్తెరిగిన ప్రాజ్ఞుడు..
తన స్మారకాన్ని
తానే నిర్మించుకున్న
స్ధితప్రజ్ఞుడు..
ప్రాస కోసం కాదు గాని..
చితి లోంచి సైతం
చీటీలు నడపగల
సిసలైన *_మార్గదర్శి.._*
*_ఈరోజున ఇలా మంటలలో.._*
అగ్నికీలలు కావవి
అక్షర జ్వాలలు..
అక్కడ మండుతోంది
కదలిక లేని శరీరం కాదు..
తెలుగు జాతిని
కదిలించిన అక్షరం..
అదిగో చూడు..
ఆవైపు..
ఇప్పుడైనా..ఎప్పుడైనా
వెలుగుతూనే ఉంటుంది..
ఆ కీర్తి దివ్వె..
స్ఫూర్తిని నింపుతూ..
*Ramoji is here..*
*Alive.. for ever..*
అంటూ..
అదే అదే ఎప్పటికీ..
*_ఈనాడు_* లో
కనీకనిపించని బ్యానర్..
రామోజీరావు
సక్సెస్ జోనర్..!