అవమానంగా ఫీలవుతున్న సీనియర్లు
కూటమి కూర్పులో పార్టీ నేతలకు తగ్గిన పదవులు
అంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) మంత్రి వర్గంలో సీనియర్లకు చోటు దగ్గక పోవడం చర్చ నీయంగా మారింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కొత్త రక్తం ఎక్కించినట్లు కనిపించినా పరిపాలనా పరంగా గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన పాత వారిని పక్కన పెట్టడం వెనక బాబు ఉద్దేశం అర్దం కాక సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బోండా ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నక్కా ఆనంద్ బాబు, యనమల రామకృష్ణుడు తదితరులు శుక్రవారం చంద్రబాబు నాయుడును కలిస్తే తమ ఆవేదన అర్దం చేసుకుంటాడని వెళ్లి కలిసారు. అయితే చంద్రబాబు వారిని సాదరంగా ఆహ్వానించి ఎంతో గౌరవ మర్యాదలు వ్యక్తం పరిచినా ఏతా వాతా ఇంకా ఏం… మంత్రి వర్గంలో భర్తీలు ఉండబోవనే విదంగా సెలవిచ్చారు. ఏవో ఇతరత్రా అవకాశాలు కల్పించే విదంగా భరోసా కూడ ఇవ్వలేక మీ సేవలు ఉపయోగించుకుంటామని మాత్రం చెప్పారట.
పైగా మంత్రి వర్గంలో సమ తూకం పాటించామని అన్ని వర్గాల వారికి ప్రాతినిద్యం వహించేలా చూశామని ఈ సారి రాష్ట్రం అభివృద్దిని చాలా ప్రిస్టేజి ఇష్యూగా తీసుకుని కూటమిలో ఉన్న రాజకీయ పక్షాలకు న్యాయం జరిగేలా ప్రాతినిద్యం కల్పిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చంద్రబాబు నాయుడు వారికి వివరించారు.
మంత్రి పదవులు రాలేదని నిరాశ అవసరం లేదని సీనియర్ల సేవలను ఇతర ప్రాధాన్యత కలిగిన పనులలో వినియోగిస్తామని పార్టీలో సీనియర్ల సేవలు అవసరమని అన్నారు.
చంద్రబాబు నాయుడు ఎంతగా స్వాంతన మాటలు పలికినా సీనియర్లలో నెల కొన్న అసంతృప్తి మాత్రం తొలిగి పోయే పరిస్థితి కనిపించడం లేదు.
పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని అధికారం లోకి వచ్చే వరకు చాలా కష్ట పడిన రోజులు గుర్తు చేసుకుంటూ సీనియర్లు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వెల్లగక్క కుండా ఉండ లేక పోతున్నారు.
కేబినెట్(Cabinet) లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలని మాజి మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu ) సూచించారు. మార్పుకోసం ప్రజలు తీర్పునిచ్చారని, దానికి అనుగుణంగా మంత్రి వర్గ కూర్పు ఉండాలన్నదీ చంద్రబాబు(Chandra Babu) ఉద్దేశమని అన్నారు. అంకితభావం , చిత్తశుద్ధితో మంత్రులు పనిచేయాలని సూచించారు. యువత (Youth) రాజకీయంలోకి వచ్చినప్పుడు వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీగాని , ప్రభుత్వం గాని నాలుగు కాలాల పాటు ఉంటుందని అన్నారు.
సీనియర్లను ఎలా చంద్రబాబు నాయుడు సంతృప్తి పర్చనున్నాడో వారికి ఎలాంటి సేవలు చేసే పనులు అప్పగించనున్నాడో ముందు ముందు చూడాలి. మంత్రి వర్గంలో చోటు దక్కక పోవడం సీనియర్లు చాలా అవమానంగా భావిస్తున్నట్లు వారి సన్నిహితులలో చర్చ జరుగుతోంది.
–ఎండ్స్