వెంటనే ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం – రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి

సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరించారు.

Admin
By Admin

పునః ప్రారంభమైన ప్రజావాణి

ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించిన డాక్టర్ చిన్నారెడ్డి

హైదరాబాద్, జూన్ 7 :: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాలనా పరమైన అడ్డంకు లు తొలగాయని ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు.
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరించారు.
అన్ని విభాగాలకు సంబందించి మొత్తం 373 దరఖాస్తులు నమోదయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 120 దరఖాస్తులు, విధ్యా శాఖకు సంబందించి 43, మున్సిపల్ శాఖకు సంబందించి 43, హోం శాఖకు సంబందించి 29, పౌరసరఫరాల శాఖకు సంబందించి 18, ఇతర శాఖలకు సంబందించి 120 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *