కాపు కు బదులు రెడ్డి – జీవితాంతం జగన్ తో ఉంటా
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ప్రకటన
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గెలుపుతో కాపు నేత మాజి మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకునే యత్నాలు ప్రారంభించారు.
పిఠాపురంలో పవన్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ప్రసక్తి లేదని గెలవనీయ బోనని గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్ర గడ పద్మనాభం శపథం చేశారు. పవన్ గెలుపుతో ముద్రగడ పేరు మార్పుకు సిద్దపడ్డాడు.
వంగాగీతపై 70 వేల ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాన్ విజయం సాధించారు. ముద్రగడ పద్మనాభం తన మాటపై నిలబడేందుకు పేరు మార్పిడికి ప్రయత్నాలు ప్రారంభించానని మీడియాకు తెలిపారు. అయితే ఇక్కడే ఓ ట్విసిట్ ఇచ్చారు. కాపుకులానికి చందిన ముద్ర గడ పద్మనాభం కాపు నేతగా ఖ్యాతి పొంది ఇప్పుడు రెడ్డిగా మారబోతున్నారు. ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకోబోతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంభందించిన వివరాలు వెల్లడిస్తూ రెండు మూడు రోజుల్లో గెజిట్ పబ్లికేషన్ కోసం దరఖాస్తు చేస్తానని తెలిపారు.
జగన్ ఓటమిని ముద్ర గడ జీర్ణించు కోలేక పోతున్నాడు. లక్షల కోట్లు ప్రజా సంక్షేమం కోసం జగన్ వెచ్చించాడని అయినా ప్రజలు ఎందుకు ఓడించారో అర్దం కాలేదన్నారు. దేశంల ఏముఖ్యంత్రి చేయనివిదంగా సంక్షేమ పథకాలు అమలు చేసాడని అన్నారు. ప్రజలు ఇవేవి అర్దం చేసుకోకుండా ఓడించారని ఇక ముందు ఏ నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయలేని విదంగా తీర్పు ఉందని అన్నారు.
తన ప్రయాణమంతా వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీతోనే కొనసాగుతుందని అన్నారు. జీవితాంతం జగన్ తోనే ఉంటానని ముద్రగడ స్పష్టం చేసారు.
పవన్ కు సపోర్టుగా ముద్రగడ కూతురు
ఎన్నికల్లో ముద్ర గడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆయన కూతురు క్రాంతి భారతి పవన్ కు సపోర్ట్ చేసింది. పవన్ విజయం కోసం ఆమె ఎన్నికల ప్రచారం కూడ చేసారు. తండ్రి కూతురు రాజకీయాలు ఎన్నికలకు ముందు హాట్ టాపిక్ గా మారాయి. కూతురు తన ప్రాపర్టి కాదని ముద్రగడ కామెంట్స్ చేసి విమర్శలకు గురయ్యాడు.