హన్మకొండ నగరంలో ఫుడ్ సేఫ్టి అదికారులు పలు హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. కుళ్లి పోయిన మాంసం, బూడు పట్టి పోయిన ఆహార పదార్థులు పట్టుకుని ధ్వంసం చేసారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి.
ఈ వార్త తెల్సిన ఫుడ్ సేఫ్టి అధికారులు చేసిన పనికి నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. అధికారులు రెగ్యులర్ గా తనిఖీలు చేయక పోవడంతో హెటెల్స్ లో రెస్టారెంట్లలో ఇలాంటి ఫుడ్డు పెడుతున్నారని విమర్శలు చేశారు. రెగ్యులర్ తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.
హనుమకొండ జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వి జ్యోతిర్మయి జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ బృందంతో కలిసి పట్టణంలోని అరణ్య మరియు జంగల్ తీమ్ రెస్టారెంట్ నందు రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా మాంసపు ఉత్పత్తులను నిలువ చేసి, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన పన్నీరు, తుప్పు పట్టిన వంట పాత్రలను వంటలు తయారు చేయడానికి ఉపయోగించి ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని 26kgs ల మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్ నందు తనిఖీ చేయగా కృత్రిమ హానికరమైన రంగులను చికెన్ కబాబ్స్ మరియు తదితర మాంసపు ఉత్పత్తులకు మరియు తదితర ఆహార పదార్థాలలో కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేసి అమ్ముతు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యంకు FSSA చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేసి, సుమారు 11 కేజీల రంగు కలిపిన, బూజు పట్టిన చికెన్, ప్రిపేర్ ఫిష్ టిక్క,అపరిశుభ్ర వాతావరణంలో నిలువ ఉంచి, బొద్దింకలతో కూడిన ఇడ్లీ పిండి, బెల్లం, ధ్వంసం చేసి నోటీసులు అందజేయడం జరిగింది.అట్లాగే హన్మకొండ చౌరస్తాలోని అశోక హోటల్( కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ) ను తనిఖీ చేయగా హానికరమైన కృత్రిమ రంగులు కలిపిన ఆహారపదార్థాలను గుర్తించడంతోపాటు భారీగా రంగు డబ్బాలను, మళ్లీ మళ్లీ కాల్చిన రీ యూజుడ్ 10 లీటర్ల మంచి నూనెను, కాలం చెల్లిన కసూరి మేతి, ఎవరెస్టు చికెన్ మసాలాలు, కాల పరిమితి చెందిన సాస్ బాటిల్స్ ను గుర్తించి ధ్వంసం చేసి, అనుమానిత కల్తీ ఆహార పదార్థాలైన బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన 5,500 విలువగల 17 నూడుల్స్ ప్యాకెట్లను, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేసి, శాంపుల్స్ తీసి ప్రయోగశాలకు తరలించడం జరిగింది. అలాగే ప్లాస్టిక్ కవర్లలో నిలువ ఉంచిన చికెన్ స్వాధీన పరుచుకుని, శాంపిల్ యొక్క రిజల్ట్ ఆధారంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగినది. హోటల్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీస్ మరియు FSSAI నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో హనుమకొండ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి వేణుగోపాల్ , వరంగల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిహెచ్. కృష్ణమూర్తి, మహబూబ్ నగర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ p. మనోజ్ కుమార్, నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.