సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కు మద్దతుగానిలుస్తున్న రైతులు
ఎంపి, నటి కంగనా రనౌత్ చెంపలు వాయించిన కేసులో కేంద్ర హోం శాఖ సీరియస్
ఎంపి, నటి కంగనా రనౌత్ చెంపలు వాయించిన కేసులో కేంద్ర హోం శాఖ సీరియస్
సస్పెన్షన్ లో కుల్వీందర్ కౌర్
విచారణ నివేదిక అనంతరం చట్టపరమైన చర్యలు
విచారణ నివేదిక అనంతరం చట్టపరమైన చర్యలు
నటి కంగనా రనౌత్ -kangana Ranout చెంపలు వాయించిన కేసులో సీఐఎస్‌ఎఫ్ CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ -kulwinder kour పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే కుల్విందర్ కౌర్ ను సస్పెండ్ చేశారు. ప్రస్తుత కేసు విచారణ కొనసాగుతోంది. ఎయిర్ పోర్టులో సిసి టివి ఫుటేజీలను పరీశించారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ కేసును చాల తీవ్ర చర్యగా భావిస్తున్నామని మొహాలి పోలీసు డిఎస్పీ కెఎస్ సంధు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కుల్విందర్ కౌర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్, ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు చండీఘడ్ విమానాశ్రయం చేరుకున్నపుడు ఈ సంఘటన జరిగింది. కంగనా రనౌత్ ఢిల్లీలో ఎన్డిఏ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ హఠత్పరిణామానికి కంగనా రనౌత్ విస్తు పోవడమే కాక కంగారు కూడ అయ్యారు. ఏం జరుగుతుందో అర్దం అయ్యే లోపే కుల్విందర్ కౌర్ ఆమె చెంపలు ఎడా పెడా వాయించారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున ఈ దృష్యాలు బయటికి రాకుండా మీడియా వారికి చేరకుండా సిఐఎస్ఎఫ్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
కంగనా రనౌత్ చెంపలు వాయించిన కుల్విందర్ కౌర్ కు రైతు సంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. రైతుల ఉద్యమం సందర్భంగా పంజాబ్‌లోని రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగా బిజెపి ఎంపి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల ఫలితంగానే ఈరోజు ఈ సంఘటన జరిగిందని కంగనా రనౌత్ దురుసుగా ప్రవర్తించారని, కంగనాకు డోప్ టెస్ట్ చేయించాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ స్పందించారు.
“రైతులు, సిక్కుల గురించి కంగానా రనౌత్ చాలా అసభ్యకరంగా మాట్లాడి అవమానించింది. సిక్కులు సహించ లేరు. మాతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. దయ చేసి అలాంటి పదజాలం ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం” అని మరో రైతు సఘం నాయకుడు హరేంద్ర లఖోవాల్ పేర్కొన్నారు. మోది తమ డిమాండ్లను నెర వేర్చ లేదని అఁదుకే ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ మెజారిటి లభించ లేదని అన్నారు.
కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని సీఐఎస్ఎఫ్ మహిళా సైనికురాలు కుల్విందర్ కౌర్ తెలిపారు. ఆమెలో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించడం లేదు. చాలా నిశ్చయంగా దృడ సంకల్పంతో ఉన్నారు. రైతు ఉద్యమంలో మహిళలు 100 రూపాయలకే కూర్చుంటున్నారని కంగనా రనౌట్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా గాయపరిచాయని అప్పట్లో రైతుల ఆందోళనలో తన తల్లి కూడ ఉన్నారని ఆమె తెలిపారు.
పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 35 సంవత్సరాల కుల్విందర్ కౌర్ గత 15 సంవస్తరాలుగా సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడ సిఐఎస్ఎఫ్ లో ఉన్నారు.
కౌంగనౌ రనౌత్ చెంపలు వాయించిన కుల్విందర్ కౌర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు లభిస్తున్నాయి. మంచి పనిచేశారని రైతులను అవమాన పరిస్తే ఎవరికైనా ఎంతటి వారైనా ఇలాంటి శాస్తి జరగాల్సిందే నని స్పందిస్తున్నారు.
కంగనా రనౌట్ కు జరిగిన అవమానంపై కూడ నెటిజెన్లుసానుభూతి చూపుతున్నారు. అయ్యే పాపం ఇలాంటివి జరగ కూడదంటూ బుగ్గలు ఎల్ కమిలి పోయాయో పాపం అంటూ సోషల్ మీడియాలో సానుభూతి సందేశాలు పంపుతున్నారు.