ఇది కాల్చకోయి నాపై ఒట్టు..!

Admin
By Admin

ఇది కాల్చకోయి
నాపై ఒట్టు..!

*””””**”””***

సురేష్ ELISETTY
9948546286

✍️✍️✍️✍️✍️✍️✍️

సరదా సరదా సిగిరెట్టు..
ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టు..
కంపుగొట్టు ఈ సిగిరెట్టు
ఇది కాల్చకోయి నాపై ఒట్టు..

ఇదే పాటలో
పాజిటివ్..నెగెటివ్..
దమ్ము కొట్టడంలోని
ప్రమోదంపై భర్త..
ప్రమాదంపై భార్య..
ఈ విషయంలో
ఇల్లాలి మాటే రైటు..!
ప్రతి ఇంట్లో జరగాలి
ఇలాంటి ఫైటు…!!

అసలు..పొగాకు ముప్పు
సర్కారుదే పెద్ద తప్పు..
కోట్లాది రూపాయల ఖర్చుతో
వద్దని ప్రచారం..
నిషేధించరు అదేమి గ్రహచారం..
పొగాకు..ఖైనీ..గుట్కా..
మాదక ద్రవ్యాలు..మద్యం..
ఇవన్నీ ఆదాయ మాధ్యమం
అందుకే వద్దనేది
ఒట్టి నినాదం..
ప్రజలకేగా ప్రమాదం!

సిగిరెట్లలో ప్రమాదం నికోటిన్
సర్కారులో డేంజర్ నెపోటిజం..
ఆదాయ వనరులే
సర్కారుకు ప్రీతి…
ఎందరు బలైనా
ఉండదు భీతి!

పొగాకు ఆరోగ్యానికి హానికరం..
సిగరెట్ స్మోకింగ్
ఈజ్ ఇంజూరియస్
టు హెల్త్..
ఇది సర్కారు
ప్రాయోజిత జోకు
చేస్తూ అమ్మకాల షోకు..
ఇస్తూ షాకు..
చిత్తశుద్ధి లేని ప్రకటనదేల..
అమ్ముతూ కుమ్మడమే కదా..
ఇదే కదా ఇదే కదా
ప్రభుత్వాల తీరు సదా..!

పొగాకు వ్యతిరేక దినం..
ఇది కాదు అవసరం..
శాశ్వత నిషేధం..
అదే కావాలి నినాదం..
ప్రభుత్వమే మద్యాన్ని
మట్టుపెట్టాలి..
పొగాకుకు పొగ పెట్టాలి..
అలా చేయనీ సర్కారు
అప్పుడది బెస్టు…
అలా చేయని సర్కారు..
ఇంకెన్ని చెప్పినా వేస్టు..!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *