ఢిల్లీలో అప్పుడలా.. ఇప్పుడిలా!

By Admin

ఢిల్లీలో అప్పుడలా..
ఇప్పుడిలా!

నాడు జగన్ జస్ట్ హలో
ఇప్పుడు బాబుకి బ్రహ్మరథం

2024..
బాబుకి ఢిల్లీలో బ్రహ్మరథం..

2019..జగన్మోహన రెడ్డికి గత అయిదేళ్లలో అదే ఢిల్లీలో లెక్కకు మించిన చేదు అనుభవాలు..

ఎందుకు ఈ తేడా..

దురదృష్టం వెంటాడింది అనుకున్నా..
రాజకీయాల్లో ఇలాగే జరుగుతుందని సరిపెట్టుకున్నా..
ఇలా జరగడం వైసిపికి మరీ ఓర్వలేని వ్యవహారం..

గత ఎన్నికల్లో జగన్ పార్టీ ఇంచుమించు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధించిన స్థాయిలోనే గెలిచింది.
అయితే అప్పుడు
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధిక స్థానాలు గెలిచి ఎవ్వరిపై ఆధారపడే స్థితిలో భారీ విజయాన్ని అందుకుంది.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ
ఘోర పరాజయాన్ని చవి చూసి బిజెపిని కలలో కూడా అందుకోలేనంతగా వెనకపడిపోయింది.అందుకే జగన్ చేతిలో అన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ బిజెపి ఆయనకు పెద్ద విలువ ఇవ్వలేదు.పైగా జగన్ ట్రాక్ రికార్డ్ కూడా అంత మంచిది కాదనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే.అందుకే జగన్ వెంపర్లాడినా కమలనాథులు ఆయన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఒకోసారి ఆయనకి కాస్త గౌరవం లభించినా ఆ తర్వాత పర్యటనలోనే
ప్రధాని కాదు కదా అమిత్ షా ఇంటర్వ్యూ సైతం దొరకని గడ్డు పరిస్థితి.

కట్ చేస్తే..

2024 ఎన్నికల్లో..

చంద్రబాబు బిజెపితో జత కట్టి మరీ ఎన్నికలకు వెళ్లారు.
ఈసారి బిజెపికి 240 సీట్లు మాత్రమే దక్కాయి.
ఎన్డీయే కూటమికి మొత్తం
293 సీట్లు వచ్చాయి.తెలుగుదేశం పార్టీనే కూటమిలో బిజెపి తరవాత రెండో పెద్ద పార్టీగా ఉంది.అవతల కాంగ్రెస్ పార్టీ పుంజుకుని సై అంటే సై అన్నట్టు తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది.
కాంగ్రెస్ కూటమికి..ఎన్డీయే కూటమికి గల స్వల్ప తేడా హస్తినలో చంద్రబాబుని
హీరోగా మార్చింది.

ఎన్డీయే మైనస్ టిడిపి..
267..(పవన్ సీట్లు కాకుండా)

అదే సమయంలో కాంగ్రెస్ ప్లస్ టిడిపి 239,.

ఇప్పటికైతే ఈ ఈక్వేషన్ అంత ప్రమాదకరంగా కనిపించకపోయినా ఏమో..
రేపటి రోజులు ఎలా ఉంటాయో..

ఒకవేళ చంద్రబాబు నిజంగా కాంగ్రెస్ పార్టీతో చెయ్యి కలిపితే ఇంకొన్ని పార్టీలను కూడా లాక్కొచ్చే పరిస్థితి
ఉండవచ్చు..అదీగాక రేపు 2029 ఎన్నికల్లో ఎటుపోయి ఎటు తిరిగినా..కాంగ్రెస్ ఇంకా పుంజుకున్నా..బిజెపి అక్కడి వరకు ఆలోచించి
చంద్రబాబు నాయుడుతో
దోస్తీని భద్రంగా పరిరక్షించుకుంటుందని
ఆశించవచ్చు.మొహమాటం లేకుండా చెప్పాలంటే 2029 నాటికి కూడా ఆంధ్రలో టిడిపికి బలమైన ప్రత్యర్థి ఉండదేమో.కానీ బిజెపి పరిస్థితి అలా కాదు అనుకోవాల్సి ఉంటుంది.
అప్పటికి బిజెపి మూడు టర్ములు పూర్తి చేసుకుంటుంది.వరసగా మూడే కష్టం..ఇక నాలుగంటే.. ఇంకా కష్టం..
అందుకే బిజెపికి బాబు విఐపి..ఇవన్నీ బాబుకి బాగా కలసివచ్చిన అంశాలు.

బాబు కంబ్యాక్ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర విశేషమైనది..అది చంద్రబాబు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి.మోడీకి బాబుని మళ్లీ దగ్గర చేసింది నిశ్శబ్ధంగా పవన్ కళ్యాణ్.
లేదంటే 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎప్పటికీ బిజెపి శిబిరంలో బాబుకి చోటు ఉండేది కాదు..

ఇది పటిమ కాదు..కాలమహిమ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version