-
“కుల సర్వే” కసరత్తు కు నిపుణులతో – బీసీ కమిషన్ భేటి
*కార్యాచరణ లో భాగంగా వివిధ రంగాల విషయ నిపుణులతో సుధీర్ఘ సమాలోచనలు*
-
*విధి విధానాల ఖరారుకు మేధావుల అభిప్రాయాలు కోరిన బీసీ కమిషన్
*ప్రశ్నావళి (ఫార్మాట్) లో చేర్చాల్సిన ప్రశ్నలపై సలహాలను, సూచనలను కోరిన బీసీ కమిషన్* *కమిషన్ పనితీరుపై ప్రశంసలు ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం ను అభినందించిన పీపుల్స్ కమిటీ బృందం*
- రాష్ట్రం లో త్వరలో చేపట్టబోయే “సామాజిక, ఆర్థిక కుల సర్వే” (కుల గణన) కు సంబంధించి, తాము వెలిబుచ్చిన మౌఖిక అభిప్రాయాలను, లిఖిత పూర్వక ప్రతిపాదనలను పరిశీలించి, తగు విధంగా చర్యలు చేపట్టడానికి వీలుగా, ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ విషయ నిపుణులు, మేధావుల ప్రతినిధుల బృందం రాష్ట్ర బీసీ కమిషన్
సామాజిక,ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో నిర్ధిష్టంగా “కుల సర్వే” మొదలు పెట్టడానికి గానూ, పూర్తి స్థాయి “కార్యాచరణ ప్రణాళిక” ( Action Plan) రూపొందించి ఇవ్వాలని ప్రభుత్వం, బీసీ కమిషన్ ను కోరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే అధికారికంగా SC,ST,BC ఇతర అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కులసర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లోనే “కుల సర్వే” కు విధి విధానాల ఖరారు, ప్రశ్నావళి రూపకల్పన, అవలంభించాల్సిన పద్ధతులు మున్నగు అంశాలపై రాష్ట్ర బీసీ కమిషన్ పని మొదలు పెట్టింది.
ఈ మేరకు సోమవారం నాడు, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సి. హెచ్ .ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే. కిశోర్ గౌడ్, సభ్య కార్యదర్శి శ్రీమతి బి. బాల మాయ దేవి (ఐ.ఏ.ఎస్) లతో, పీపుల్స్ కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ ఖైరతాబాద్ (హైదరాబాద్) రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయం లో జరిగింది.- ఈ సమాలోచనలలో జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ మురళి మనోహర్, ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్ రావు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ పద్మజాషా, ప్రొఫెసర్ నరేంద్ర బాబు, డాక్టర్ ఎస్ పృధ్వీ రాజ్, దేవల్ల సమ్మయ్య, సతీష్ కొట్టే తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మౌఖికం గా తమ అభిప్రాయాలను, సలహాలను, ఇచ్చింది. పలు ఆక్షేపణ లను వెలిబుచ్చింది. లిఖిత పూర్వకంగా పలు అధ్యయన పత్రాలను అందజేసింది.
విషయ నిపుణులు, మేధావుల తో జరిగిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భం గా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల లో నిర్వహించిన “కుల సర్వే” లపై లోతుగా చర్చించారు. ఆయా రాష్ట్రాలలో సర్వే లు చేస్తున్నపుడు ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, ప్రజల స్పందన, సాంకేతికంగా వివిధ అంశాలు, సాఫ్ట్ వేర్ ను రూపొందించడం, ఇలా ఒక్కొక్కటిగా కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం… ఈ ప్రతినిధుల బృందం కు సాధికారికంగా వివరించారు.ఇప్పటికే బీసీ కమిషన్ దేశవ్యాప్తంగా సేకరించిన అధ్యయన వివరాలను వివిధపత్రాల రూపంలో అందచేశారు. మౌఖికంగా అనేక అంశాలను, సోదాహరణంగా ప్రతినిధుల బృందం కు వివరించారు. ఈ నేపధ్యం లో పీపుల్స్ కమిటీ తమ సంతృప్తి ని వ్యక్తం చేసింది. - ప్రత్యేకంగా ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం ను అభినంధించింది. ఈ భేటీ ఫలవంతంగా జరిగిందని పీపుల్స్ కమిటీ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది.రాష్ట్ర బీసీ కమిషన్ కొనసాగిస్తున్న “కుల సర్వే” ఆక్షన్ ప్లాన్ తయారీ లో భాగంగా, త్వరలో రాష్ట్రం లోని అన్ని వర్గాల, ప్రతినిధులు, మేధావులు, ప్రజా, కుల సంఘాలను ఆహ్వానిస్తామని ఛైర్మన్ కృష్ణమోహన్ రావు తెలిపారు. వారంలోపే తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని, నిర్మాణాత్మకంగా, హేతుబద్ధం గా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన వివరించారు.
“కుల సర్వే” కసరత్తు కు నిపుణులతో – బీసీ కమిషన్ భేటి
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల లో నిర్వహించిన “కుల సర్వే” లపై లోతుగా చర్చించారు. ఆయా రాష్ట్రాలలో సర్వే లు చేస్తున్నపుడు ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, ప్రజల స్పందన, సాంకేతికంగా వివిధ అంశాలు, సాఫ్ట్ వేర్ ను రూపొందించడం, ఇలా ఒక్కొక్కటిగా కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం... ఈ ప్రతినిధుల బృందం కు సాధికారికంగా వివరించారు.
Leave a comment