ఉత్సాహం పట్టలేక పోతున్న పవన్ కళ్యాన్ అభిమానులు
అకీరా నందన్ అడుగులు ఎటు వైపు
కొణిదెల అకీరా నందన్. కొణిదెల వంశంలో ఎవరికి అందనంతగా ఆరడగుల
4 ఇంచులు ఎదిగిన అకీరా. అకీరా హైట్ చూసి ఆశ్చర్యపోతున్న జనాలు.
తండ్రి పవన్ కళ్యాన్ ఘన విజయం సాధించినప్పటి నుండి అకీరా
సంతోషానికి అవధులు లేవు. ఎ్ననికల ఫలితాలు వెలువడినప్పటి నుండి
పవన్ కళ్యాన్ ఎక్కడికెళ్లినా భార్య అన్నా లెజెవాతో పాటు అకీరాను వెంట
బెట్టుకుని వెళ్తున్నాడు. తన సోదరుడు చిరంజీవితో పాటు తల్లి అంజనమ్మ
ఆశీర్వాదం తీసుకునేందు వెళ్లిన సమయంలో అకీరా కూడా వెళ్లాడు.
చిరంజీవి కుటుంబ సబ్యులందరూ అక్కడ ఉన్నారు. అల్లు అర్జున్
కుటుంబం సబ్యులు ఎవరూ అక్కడ కనిపించ లేదు.
కుటుంబ సబ్యుల మద్యలో అకీరా ఎక్కడ నిల్చున్నా అందరికంటే
హైట్ లో ఉండి అందరి దృష్టిలో పడ్డాడు. నాగబాబు కన్నా
అకీరా హైట్ ఎక్కువే. చంద్రబాబు బాబు నాయుడు దగ్గరకు వెళ్లిన
సమయంలో కూడ అకీరా ఉన్నాడు. అట్లాగే ఢిల్లీలో ఎన్డిఏ కూటమి
సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన పవన్ కళ్యాన్ అకీరాను తీసుకు
వెళ్లాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పవన్ కలిసారు.
ఈసందర్భంగా భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు
అకీరా ఉన్నాడు. పెద్దవారు కనిపిస్తే వినయంగా వంగి కాళ్లకు దండం పెట్టిన
అకీరాను చూసి అతని హైట్ చూసి అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం అకీరాను చూసి సంభ్రమాశ్చర్యాలతో
భుజం తట్టి అభినందించారు.
ఇక ఈ దృష్యాలుచూసిన పవన్ కళ్యాన్ అభిమానులకు సంతోషం
అవధులు దాటింది. తండ్రి వారసత్వం లో అకీరా పయనమెటని
సినిమా ఎప్పుడంటూ మెసేజ్ లు పెడుతున్నారు. అకీరా అడుగులు
రాజకీయం వైపా లేక సినిమా రంగం వైపా అనేది ఇప్పుడ్పపుడే క్లారిటీ
లేని విషయం. కాని అకిరా విషయంలో తొందరవద్దని తల్లి రేణూ దేశాయి
అభిమానులను వారించారు. అకీరా ఆలోచనలను అభిమతాన్ని అర్దం
చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు.