దందాలో మాజి మంత్రి తలసాని పాత్ర లేనట్లేనా ?
ఇద్దరు అధికారులను అరెస్టు చేసిన ఎసిబి అధికారులు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్ల కుంభ కోణంలో మాజి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర లేనట్లేనా లేదంటే తప్పించారా ఏసలు ఏం జరిగింది అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గొర్ల ఖరీదులో మద్య దళారులు చేరి భారి కుంభ కోణానికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై కాంగ్రేస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సుక్రవారం ఈ కేసుకు సంభందించిన ఇద్దరు అధికారులను అరెస్ట్ చేశారు.
మాజి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఓస్టీగా పనిచేసిన గుండమరాజు కళ్యాన్, సబావత్ రాంచందర్ లను అరెస్టు చేశారు. గొర్ల కొనుగోలులో వీరిద్దరూ మధ్య దళారులను దందాలో దించి వారి ద్వారా అవకతవకలకు పాల్పడ్డారనవి ఎసిబి అధికారుల అభియోగం. ఇద్దరు సుమారు 2 కోట్ల 10 లక్షల మేర అవినీతికి పాల్పడ్డారని ఎసిబి అధికారులు పేర్కొన్నారు.
గతంలో ఈ కుభం కోణంలో మాజి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వార్తలు వచ్చాయి. అయితే తన పాత్ర లేదని అసలు కుంభ కోణమనేది ఏది జరగ లేదని అప్పట్లో మాజి మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన నేపద్యంలో మాజి మంత్రి పాత్ర విషయంలో ప్రస్తావన లేదు. మాజి మంత్రి పాత్ర అసలులేదా ఉంటే తప్పించారా ఏసలు ఏం జరిగింది విచారణ ముగిసి నట్లేనా మాజి మంత్రికి క్లీన్ చిట్ ఇచ్చినట్లేనా వంటి విషయాలపై ఎసిబి అధికారులు స్పష్టం చేయాలి.
మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ యాదవ్ ను కాదని అధికారులు అవకతవకలకు పాల్పడే అవకాశాలు ఉండవు. మంత్రి పాత్ర ఉన్నా అసలు విషయాలు దాచి పెట్టి మరో సందర్భంలో మాజి మంత్రిని బయటికి లాగుతారా అనే విషయాలపై కూడ క్లారిటి లేదు. నిర్ణయాలలో రాజకీయ జోక్యాలు ఉంటే విచారణల్లో పారదర్శకత లోపిస్తుంది.