విత్తనాల విక్రయాల దుకాణాలను జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వరంగల్, హన్మకొండ నగరాలలో జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య, సిక్తాపట్నాయక్ వేరు వేరుగా విత్తనాలు విక్రయించే దుకాణాలలో విత్తనాల నిల్వలు వాటి నాణ్యత ప్రమాణాలను తనికఖి చేశారు. నకిలి విత్తనాలు విక్రయిస్తే ఖఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వరంగల్ కలెక్టర్ పి ప్రావీణ్య పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కల్సి విత్తనాల విక్రయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
నకిలి విత్తనాలు విక్రయించినా బ్లాక్ చేసినా పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
విత్తన డీలర్లు రాబోయే వానాకాలం సీజన్ కు సంబంధించి రైతాంగానికి నాణ్యతతో కూడిన విత్తనాలు అమ్మాలని తెలిపారు. రైతులు నష్టపోకుండా నకిలీ విత్తనాల బారిన పడకుండా డీలర్లు సహకరించాలన్నారు. అమ్మకాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని ఎం ఆర్ పి రేటు కంటే ఎక్కువ అమ్మకూడదని, లేబుల్ లేకుండా అమ్మ కూడానని సూచించారు. అనుమతి లేని విత్తనాలు, విత్తనాలు మార్కెట్ లోనికి రాకుండా నివారించేందుకు వ్యవసాయ, పోలీస్, రెవిన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశామన్నారు
కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ డీలర్లు అందరూ వ్యవసాయ, పోలీస్ శాఖలకు సహకరించాలని, రైతులకు మేలు చేయాలన్నారు. ముఖ్యంగా చట్టం గురించి అందరూ తెలుసుకోవాలని, విత్తనాలు అక్రమంగా నిల్వ చేసిన, రవాణా చేసిన, లూజుగా అమ్మిన జరిమానా తో పాటు శిక్షకు కూడా గురికావాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి లు అబ్దుల్ బారి, రవీందర్, ఏసీపీ లు తిరుపతి, కిరణ్ కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాల్ ఏ డి ఏ సురేష్ కుమార్, వ్యవసాయ అధికారులు, జిల్లా విత్తన డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.